యాంకర్ రవి ‘తోట బావి’ ఫస్ట్ లుక్

594
Anchor Ravi Thota Bavi
- Advertisement -

 బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ రవి. పటాస్ షో తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ రవి హీరోగా ఆమధ్య ఇదీ మా ప్రేమ కథ అనే సినిమాలో హీరోగా నటించి తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ రవి నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. కాగా రవి హీరోగా మరో సినిమా తెరకెక్కుతుంది.

ఈసినిమా పేరు తోటబావి. గౌతమి హీరోయిన్ గా నటిస్తుంది. జోగులాంబ క్రియేషన్స్‌ పతాకంపై ఆలూర్‌ ప్రకాష్‌గౌడ్‌ నిర్మిస్తున్నారు. అంజి దేవండ్ల ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యి ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు.

- Advertisement -