ఎఫ్‌బిలో రెచ్చిపోయిన యాంకర్‌ రవి….

246
Anchor Ravi Fires On Live Over His Relation With Sreemukhi
- Advertisement -

తనదైన స్టైల్‌లో కామెడిని పండిస్తూ.. బుల్లితేరలో దూసుకెళ్తున్నాడు యాంకర్‌ రవి. ముఖ్యంగా పటాస్ ప్రోగ్రాంతో మరింత పాపులరయ్యాడు. కాంట్రవర్సి,డబుల్ మినింగ్ డైలాగులతో ఈ షో మరింత పాపులరైపోయింది. ఇక ఈ షో యాంకర్‌ రవి, శ్రీముఖిలపై బోలెడన్ని పుకార్లు. వీరిపై పుకార్లే కాదు ఓవర్ యాక్షన్‌తో విసుగు కూడా తెప్పిస్తారు. ఇక వీరిపై సోషల్ మీడియాలో గుసగుసలకు అంతేలేదు. వీరి ప్రేమలో పడ్డారని లేదు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు కోడై కూశాయి.

Anchor Ravi Fires On Live Over His Relation With Sreemukhi

ఇప్పటికే పలుమార్లు పటాస్‌ వేదికగా శ్రీముఖితో రిలేషన్‌ షిప్‌పై క్లారిటీ ఇచ్చిన రవి తాజాగా ఫేస్ బుక్‌ లైవ్‌లో స్పందించాడు. పటాస్‌ వేదిక మాదిరే కాస్త ఘాటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పంచ్‌ పటాకా మాదిరి సమాధానం ఇచ్చాడు. అంతేగాదు ఫాలోయర్స్‌ను తిట్టేందుకు కూడా వెనుకాడలేదు. పటాస్‌లో బూతులు ఎక్కువైపోయాయని ఓ ఫ్యాన్ అడగగా … సినిమాల్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తపడతారని అదే పటాస్‌లో ఫాలో అయ్యామని తెలిపాడు.

‘నీది.. శ్రీముఖిది ఓవరాక్షన్ చూడలేకపోతున్నాంరా అయ్యా’ అంటూ ఒక వ్యక్తి కామంట్ పెడితే.. ‘నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా.. దాన్ని ఛేంజ్ చెయ్యరా అయ్యా’ అంటూ ఆన్సర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. శ్రీముఖితో అఫైర్ ఉందంటూ కొంతమంది రాస్తున్నారని.. ఇలాంటి వాళ్లను నరికేయమని ఓ ఫ్యాన్ సలహా ఇచ్చాడు. ఇలాంటి రాతలతో తాము మరింత ఎక్కువగా ఫేమ్ సంపాదించుకుంటామని చెప్పేశాడు.

- Advertisement -