అనసూయ పై రష్మి షాకింగ్ కామెంట్స్

81
- Advertisement -

రష్మి… ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. యాంకరింగ్‌ రంగానికే గ్లామర్‌ ను అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో రష్మి ఒకరన్న విషయం తెలిసిందే. తనదైన అందం, అభినయంతో గత పది సంవత్సరాలుగా జబర్థస్త్ యాంకర్‌ గా ఆకట్టుకుంటున్న రష్మి.. సోషల్‌ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా జబర్ధస్త్‌ షోలో జరుగుతున్న పరిణామాలపై ఓ ఇంటర్వ్యూలో రష్మి స్పందించి పలు విషయాలను బయటపెట్టింది.

తాను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం జబర్ధస్త్ షోనే కారణమని.. మల్లెమాల సంస్థ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని రష్మి పేర్కొంది. మల్లెమాల సంస్థను వదిలిపెట్టే ప్రసక్తేలేదని రష్మి తేల్చిచెప్పింది. అయితే ఈ సందర్భంగానే రష్మి.. అనసూయకు సెటైర్‌ వేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. జబర్థస్త్‌ షోను విడిచి వెళ్లిపోయిన వారికి కౌంటర్‌ గా రష్మి కామెంట్స్‌ చేసినట్లు కూడా తెలుస్తోంది.

అనసూయ బజర్థస్త్‌ ను విడిచివెళ్లిపోయింది కానీ.. తాను మాత్రం వదిలిపోనన్న కోణంలోనే రష్మి కామెంట్స్‌ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. అటు సుడిగాలి సుధీర్‌ పై కూడా రష్మి స్పందించింది. సుధీర్‌ ను కూడా జబర్థస్త్‌ను విడిచి స్టార్‌ మా కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మి సుధీర్‌ పై కూడా సెట్లైర్లు వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రష్మి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయనే చెప్పొచ్చు.

- Advertisement -