మ‌రో వివాదంలో యాంక‌ర్ ర‌ష్మీ…

428
Rashmi
- Advertisement -

బుల్లితెర‌పై వ‌చ్చే కామెడీ షో ద్వారా పాపుల‌ర్ అయింది యాంక‌ర్ ర‌ష్మీ. యూత్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ను ఏర్ప‌ర‌చుకుంది. అప్పుడపుడు వెండితెర‌పై త‌న అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఆ సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌టంతో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. కాగా అప్పుడ‌పుడు ర‌ష్మీ ప‌లు ఈవెంట్ల‌కు హాజ‌ర‌వుతుంది. అందులో భాగంగానే ఇటివ‌లే ఆమెకు తెలియ‌కుండానే పోస్ట‌ర్ పై ఆమె ఫోటోను వేశార‌ని హాడావుడి చేసిన విష‌యం తెలిసిందే.

Rashmi in 10k

తాజాగా మ‌రో ఈవెంట్ లో కూడా ఇదే సీన్ రిపిట్ అయింది. తిరుపతిలో జరగనున్న ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి రష్మి రాబోతుందంటూ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు అక్కడి ఈవెంట్ మేనేజర్లు. సోష‌ల్ మీడియాలో ఆ బ్యాన‌ర్ ను చూసిన ర‌ష్మీ ఆఈవెంట్ కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వారు నన్ను సంప్ర‌దించ‌లేద‌ని త‌న అభిమానులు కూడా ఎవ‌రూ వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పింది.

anchor rashmi

దింతో ర‌ష్మీ మెసెజ్ చూసిన ఈవెంట్ యాజమానులు ర‌ష్మీకి అడ్వాన్స్ అమౌంట్ కూడా పంపిచామ‌ని మెసెజ్ ల‌ను కూడా చూపించారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అని రిప్లై ఇచ్చాడు. ఆయ‌న పంపించిన మెసెజ్ పై ర‌ష్మీ స్పందిస్తూ..‘మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి.. అంతేకానీ ఇలా ఫాల్స్ స్టేట్‌మెంట్స్ చేయకూడదు. నాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటే అలాగే కానీయండి అంటూ సీరియ‌స్ అయ్యింది.

- Advertisement -