మొదట సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యాంకర్ రష్మీ గౌతమ్. మొల్లిమెల్లిగా పలు కార్యక్రమాల్లో పాల్గోని యాంకరింగ్ చేసుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత కొద్ది రోజులుకు అనసూయ జబర్ధస్ద్ కామెడీ షోలో యాంకర్ గా మానేయడంతో ఆ షోలో యాంకర్ గా రష్మీ ని తీసుకున్నారు. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు రష్మీ. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లిస్ట్ లో రష్మి కూడా ఉంది. జబర్ధస్ద్ షో వల్ల రష్మీకి ఫుల్ పాపులారిటి వచ్చింది.
ఇక రష్మీ బుల్లి తెరపై యాంకరింగ్ చేయడమే కాకుండా అప్పుడప్పడు పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేస్తోంది. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండింటిలోనూ తన సత్తాను చాటుతుంది. అయితే బుల్లి తెర మీద సక్సెస్ సాధించినంతగా వెండితెర మీద సక్సెస్ ను సాధించలేక పోయింది రష్మీ. తెలుగు లో ఆమె నటించిన రెండు సినిమాలు భారీ ఓటమిని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది రష్మీ.
ఇక ఒక షోలో యాంకరింగ్ చేస్తోన్న రష్మీ తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పింది….తమిళ స్టార్ అరవింద్ స్వామి తనకు చాలా ఇష్టం అని చెప్పింది. చాలా రోజలు నుంచి అతన్ని కలవాలని అనుకుంటున్నాను కానీ…సమయం కుదరడం లేదన్నారు. అరవింద్ స్వామి సినిమాలంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ప్రస్తుతం రష్మీ జబర్దస్ద్ తో పాటు అనుభవించు రాజా అనే కామెడీ షోలలో యాంకర్ చేస్తూ బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది.