బుల్లితెర యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలసై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది రష్మీ. తనపై ఎవరయినా కామెంట్ చేసినా అదే రేంజ్ మళ్ళీ కౌంటర్ ఇస్తుంది. ఎటువంటి సమస్యలనైనా ముందుండి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది. అలాగే తనకు ఎదురైన అనుభవాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రష్మీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఏకంగా ప్రధాని మోదీని ప్రశ్నించింది. గుజరాత్ లో కొంత మంది యువకులు చిరుత పులి పిల్లను పట్టుకొని దారుణంగా హింసించారు. ఆ వీడియో చూసిన రష్మీ ప్రధాని మోదీకి ట్వీట్ చేసింది. గుజరాత్‌లో ఏం జరుగుతోంది..? మనకు డిజిటల్ ఇండియా.. మోడర్న్ ఇండియాతో పాటుగా సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి అంటూ.. ట్వీట్ చేసింది. నాకు వీడియో చూడాలన్నా భయం వేసింది.. అంతలా దాన్ని హింసిస్తున్నారు అంటూ.. ట్వీట్‌లో పేర్కొంది రష్మీ గౌతమ్. మరీ ఈ వీడియోపై బీజేపీ నేతలు స్పందిస్తారో లేదో చూడాలి.
https://t.co/5oxBKgDoFn@narendramodi ji this is happening in Gujarat
Our national animal poor thing is a little cub
Sir we not only need digital and Modern India 🇮🇳 we also need a sensible India
I did not have the heart to even watch the full video so much pain and scare pic.twitter.com/eQAyhDAn6b— rashmi gautam (@rashmigautam27) October 14, 2019