గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న యాంకర్ ప్రత్యూష..

284
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతు ముందుకు కొనసాగుతుంది.దీనిలో భాగంగా తన సహచర యాంకర్ దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ యాంకర్ ప్రత్యూష నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

ఎందుకు అంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన పెంచతు ముందుకు తీసుకుపోతునందుకు కృతజ్ఞతలు.ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతం అయినందుకు అభినందనలు తెలియజేయడం జరిగుతుంది. ఏ రాజకీయ నాయకుడు అయిన ఒక కార్యక్రమం చేపట్టి మధ్యలో వదిలేయడం జరుగుతుందని.. కానీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక సామాన్య నాయకుని వలె దీన్ని ముందుకు తీసుకోనిపోతూ విజయవంతం చేయడం జరుగుతుందని తెలియజేశారు.

నాకు కూడా చెట్లను పెంచడం అంటే చాలా ఇష్టమని మా ఇంట్లో నేను మొక్కలు పెంచడం కోసం చాలా ప్రాముఖ్యత ఇస్తానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మనము వివిధ రకాల ఛాలెంజ్ లను చూస్తూ ఉంటున్నామని వాటన్నింటి కంటే ఇది సమాజానికి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఛాలెంజ్ అని దీన్ని అందరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇదే మన భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప సంపద అని తెలియజేశారు. నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చిన మా సహచర యాంకర్ దేవి నాగవల్లి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ చాలెంజ్ ఇదేవిధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం నేను మరో 4 కి ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుందని అందులో 1) ప్రముఖ యూట్యూబరు మై విలేజ్ షో అనిల్, 2) తెలుగు ప్రజలను ఏంతో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ చిన్నారి నటి సౌర్య (క్రితిక), 3) నేషనల్ బైక్ రేసర్ సందీప్ నడింపల్లి, 4) నా సహచర యాంకర్ దీప్తి వాజ్ పాయ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -