బుల్లి తెరపై వచ్చే షోలలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదిప్ మాచిరాజు. యూత్ లో ప్రదిప్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రదిప్ అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు. బుల్లి తెరపై యంకరింగ్ తో పాటు అప్పుడుప్పుడు సినిమాల్లో కూడా నటించాడు. ‘100% లవ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో నటించాడు. తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్లలో నెం1 స్ధానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మున్నా ఇటివలే ప్రదీప్ కు స్టోరీ వినిపించాడట. కథ నచ్చడంతో ప్రదీప్ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చాడని తెలుస్తుంది. 1947 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయని త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుందని తెలుస్తుంది. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తుంది. బుల్లి తెరపై సక్సెస్ సాధించిన ప్రదీప్ వెండితరపై ఏవిధంగా ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి మరి.