డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదీప్ ఇవాళ ప్రదీప్(జనవరి 10)న నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రెండు రోజుల తర్వాత కోర్టుకు హాజరవుతానని తెలిపిన ప్రదీప్ విన్నతిని మన్నించిన పోలీసులు రెండు గడువు ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రదీప్ దొరికిన విషయం తెలిసిందే.
కౌన్సిలింగ్‌కు హాజరైన సందర్భంలో ప్రదీప్ ఎవరు తాగి నడపొద్దని సూచించారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పోలీస్ కౌన్సిలింగ్‌కు హాజరుకాలేకపోయానని ఈ కౌన్సెలింగ్ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.మరోసారి ఈ తప్పు చేయనని స్పష్టం చేశారు.
ప్రదీప్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. గత శుక్రవారం వీడియో ద్వారా తాను త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపిన ప్రదీప్ తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు.