యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ఓ పబ్బులో మందు కొట్టి వచ్చిన అతను డ్రైవర్ లేకుండా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. బ్రీత్ అనలైజర్ టేస్టులో ప్రదీప్‌ది 178 పాయింట్ల రీడింగ్ నమోదయింది. ప్రదీప్ మోతాదుకు మించి మూడింతలు మద్యం తాగారు. నేడు పోలీసుల కౌన్సెలింగ్ కు హాజరు కానున్నాడు. నిబంధనల మేరకు ఆయన తన తల్లితో కలసి కౌన్సెలింగ్ కు వస్తాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
ప్రదీప్ నేడు బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నాడని, ఈ మేరకు గతవారంలోనే తమకు సమాచారం ఇచ్చాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత కోర్టు ముందు హాజరు పరుస్తామని, శిక్ష ఏంటన్నది న్యాయమూర్తి నిర్ణయిస్తారని తెలిపారు. కాగా, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో ప్రదీప్ రక్తంలో ఆల్కహాల్ కౌంట్ 178 పాయింట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిలో మద్యం తాగిన వాళ్లకు రెండు నుంచి వారం రోజుల జైలుశిక్షను విధిస్తుండటంతో ప్రదీప్ కు కూడా అదే శిక్ష పడవచ్చని తెలుస్తోంది.