ఏడేళ్లుగా ఆయనతో ఎఫైర్…

212
Anchor Lasya Reveals Shocking Facts Of Love
- Advertisement -

యాంకర్ లాస్య  మంజునాథ్ అనే మరాఠి వ్యక్తిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలె ఈ జంట నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు. ఏడేండ్ల నుంచి ఇద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందట. స్వయంగా లాస్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసింది.
Anchor Lasya Reveals Shocking Facts Of Love
నాకు కాబోయే భర్త మంజునాథ్‌తో ఏడేండ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. జీవితంలో స్థిరపడిన తర్వాత పెండ్లి చేసుకొందామని నిర్ణయించుకొన్నాం. అందుకే అన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. అని లాస్య తెలిపింది.మహారాష్ట్రకు చెందిన మంజూనాథ్ కి ముంబాయ్ లో పలు వ్యాపారాలున్నాయి. లాస్యతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక.. మంజూనాథ్ తరుచూ లాస్య యాంకరింగ్ చేసే షోస్ కి వచ్చేవాడట.
Anchor Lasya Reveals Shocking Facts Of Love
కానీ, మంజూనాథ్ లాస్య కోసమే వచ్చే విషయం ఎవరికి తెలియదట. లాస్యపై రూమర్స్ వచ్చిన ప్రతీసారి మంజూనాథ్ నీపై ఎందుకు ఇలా రూమర్స్ వస్తున్నాయి అని ప్రశ్నించేవాడట. ఇక ఇటీవలికాలంలో లాస్య యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వడానికి కారణం కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడమేనట. పెళ్లి తరువాత లాస్య మళ్లీ యాంకరింగ్ చేస్తుందట. అయితే రవితో మాత్రం చేసిది ఏమి లేదని లాస్య తేల్చిచెప్పింది.  ప్రస్తుతం లాస్య నటించిన రాజా మీరు కేక మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

- Advertisement -