లాస్యకు పెళ్లైయ్యిందోచ్…

283
anchor lasya marriage
- Advertisement -

ఎట్టకేలకు యాంకర్ లాస్య వివాహం జరిగిపోయింది. మరాఠి కుర్రాడు మంజునాథ్ తో లాస్య తన మ్యారేజ్ లైఫ్ ను ప్రారంభించింది. బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు హైదరాబాద్  లోని వింటేజ్ ప్యాలెస్  లో  లాస్య, మంజునాథ్ లు వివాహబంధంతో ఏకమయ్యారు. ఈ వేడుకలో లాస్య, మంజునాథ్ ల కుటుంబసభ్యులతో పాటు.. ఆమె క్లోజ్ ఫ్రెండ్స్  పాల్గొన్నారు. ఈ వేడుకలో యాంకర్ రవి కనిపించలేదని సమాచారం.మీడియా వర్గాలకు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు ఎలాంటి ఆహ్వానం అందలేదు.

గత నెల 28న అందరిని సర్ఫైజ్ చేస్తూ.. లాస్య తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. దీంతో లాస్య ఎవరిని పెళ్లి చేసుకుంటుందన్న అని ప్రశ్న హాట్ టాపిక్ అయ్యింది. ఆ మరుసటి రోజే  ఎంగేజ్ మెంట్ తో మరో షాకిచ్చిన లాస్య… మంజునాథ్ ను తనకు కాబోయే భర్తగా సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. మంజూనాథ్ తో లాస్య ఎఫైర్ గత ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఎట్టకేలకే ఈ ఇద్దరి ఎఫైర్ పెళ్లితో మరింత బలపడింది.

రీసెంట్ గా ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాస్య తనకు సంబంధించిన సంచలన విషయాలు రివీల్ చేసిన విషయం తెలిసిందే. మంజూనాథ్ తో రిలేషన్, యాంకర్ రవికి తనకీ మధ్య జరిగిన గొడవలు ఇలా ఎన్నో విషయాలు బయటపెట్టి సంచలనం సృష్టించింది లాస్య. దీంతో గత రెండు వారాలుగా ఈ యాంకర్ కమ్ నటి ఎంతో పాపులర్ అయ్యింది. ఈ నేపధ్యంలో లాస్య, మంజునాథ్ ల వివాహం ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా మారింది.

- Advertisement -