తన లవ్‌ ఎఫైర్ పై స్పందించిన లాస్య

154
Anchor Lasya Give Clarity About Love With Ravi
- Advertisement -

ఎంటర్టైన్‌మెంట్‌  ప్రోగ్రామ్స్‌ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టీవీ యాంకర్స్‌ రవి, లాస్య. వీరిద్దరూ యాంకరింగ్‌ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాధించుకున్నారు. ఆన్‌ స్ర్కీన్‌లో వీరి మధ్య ఉన్నకెమిస్ట్రీ అంతాఇంతా కాదు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్టీ చూసి వీరిమధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తుందని సోషల్‌ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ విషయం కాస్తా లాస్య వరకు పాకడంతో లాస్య స్పందించింది. ఆఫ్‌ స్ర్కీన్‌లో తాము ప్రొఫెషనల్‌ ఫ్రెండ్స్‌ తప్ప.. పర్సనల్‌ ఫ్రెండ్స్‌ కాదని చెప్పుకొస్తోంది లాస్య. అలాగే తమ లవ్‌ ఎఫైర్‌ గురించి వచ్చిన వార్తలపై కూడా స్పందించింది.

తనకు పరిచయమైన ఏడాదికే రవికి పెళ్లయిపోయిందని,  ఒక వివాహితుడితో తనకు ప్రేమ ఎలా ఉంటుంది అని ప్రశ్నంచింది.  తాను కూడా చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేదని, తనకు ఓ బావ ఉన్నాడని కూడా చెప్పంది. అతణ్నే పెళ్లి చేసుకుంటానని అందరితో అబద్ధం చెప్పి దూరంగా ఉండేదని,  మంజునాథ్‌ చాలామందికి తెలుసని, తనని డ్రాప్‌ చేయడానికి, పికప్‌ చేసుకోవడానికి షూటింగ్‌ స్పాట్‌లకు వచ్చేవాడని చెప్తూనే..  షూటింగ్‌ స్పాట్‌లో జరిగిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మంజుకు చెప్పేదని లాస్య వెల్లడించింది. మరి తనపై వస్తున్న ఈ పుకార్ల నుంచి తప్పించుకోడానికి  లాస్యకి ఇంకెన్ని రోజులు పడుతుందో.

- Advertisement -