మళ్ళీ కాజల్, తమన్నాతో ఎన్టీఆర్‌ రొమాన్స్‌?

170
Ntr Romance With Kajala and thamanna
- Advertisement -

జూ.ఎన్టీఆర్‌ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్‌ నుంచి ఊపందుకున్నఈ యంగ్‌టైగర్‌ ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో తన నటనా ప్రతిభను మరింత చాటుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా వరుస సినిమాలు చేసిన యంగ్‌టైగర్‌ ఇటీవలే మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసాడు. ఆ సినిమాకి కూడా పూజా కార్యక్రమాలు జరిపి సినిమాని ప్రారంభించాడు జూ.ఎన్టీఆర్‌.

ఈ సినిమా ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్లో తెరకెక్కబోతుంది. కల్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే..ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆల్రెడీ రాశిఖన్నాను ఎంపిక చేసినట్టుగా కల్యాణ్ రామ్ చెప్పేశాడు. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడట. అందుకు ఒక్కో పాత్ర సరసన ఒక్కో హీరోయిన్  అవసరమవుతోంది.

ఈ నేపథ్యంలో కాజల్, తమన్నాలను మిగతా ఇద్దరు హీరొయిన్లుగా ఎంపిక చేసినట్టు సోషల్‌ మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది. అయితే గతంలో ఈ ఇద్దరూ కూడా ఎన్టీఆర్ తో రొమాన్స్‌ చేసినవారే. మరి  ప్రస్తుతం వినిపిస్తోన్న వార్త  ఎంత వరకు నిజం అనే విషయంలో స్పష్టత రావాలంటే కల్యాణ్ రామ్ నుంచి  అధికారిక ప్రకటన వెలువడాల్సిందే!

- Advertisement -