అందంతో మతిపోగొడుతున్న హాట్ యాంకర్

575
srimukhi
- Advertisement -

యాంకర్ శ్రీముఖి… ఈ మధ్య కాలంలో బుల్లితెరపై బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనంతో పాటు …తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. తన అల్లరి మాటలతోనే కాకుండా అందంతో కూడా శ్రీ ముఖీ ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడు సినిమాల్లో కొంచెం మేజర్ రోల్స్ తో మెప్పించాలి అనుకుంటుందో ఏమో.. స్టైల్ మార్చేసింది.

srimukhi

శ్రీముఖి హీరోయిన్‌గా మాటల రచయిత, నటుడు హర్షవర్థన్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శ్రీముఖి ప్రధాన హీరోయిన్ పాత్ర చేస్తుంది.ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్‌లో శ్రీముఖి తన అందాలతో మరోసారి తన తడాఖా చూపింది. చీర కట్టులో ఎలాంటి బిడియం లేకుండా అందాల ఆరబోతకు సిద్ధపడినట్టు ట్రైలర్‌లో తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ విషయాన్నికి వస్తే 80 దశకంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా గుడ్ బ్యాడ్ అగ్లీని తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం కథ నేపథ్యం సినిమానే కావడం విశేషం. ఎందుకంటే ట్రైలర్‌లో మాటలన్నీ సినిమా చుట్టే తిరుగుతున్నాయి. ఈ సినిమాతో శ్రీముఖి కెరీర్ గ్రాఫ్ మారిపోయేలా కనిపిస్తున్నది.

మొన్నటి వరకు కొన్ని లిమిట్స్ లోనే సినిమాలను చేసింది. కానీ ఈ సినిమాలో స్టైల్ మార్చేసి హాట్ గా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలోని పాత్ర యాంకరమ్మ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

- Advertisement -