రాజశేఖర్ కోసం బాలయ్య వస్తున్నాడు..!

226
Balaiah to launch 'Garuda Vega' trailer
- Advertisement -

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడు వేగ 126.18ఎం`.

నవంబర్‌ 3న  భారీ స్థాయిలో సినిమా విడుదలవుతుండగా సినిమా ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రేపు (మంగళవారం) రాత్రి 8 గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్  జూబ్లీహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో బాలకృష్ణ …గరుడవేగ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నాడు.

ఇప్పటికే వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పూజా కుమార్ కథానాయికగా నటించగా, శ్రద్ధా దాస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.

- Advertisement -