యాంకర్‌ను ఏడిపించిన ట్రంప్..!

262
Rachel Maddow
- Advertisement -

అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకుంటున్న చర్యలపై ఎన్ని విమర్శలు వచ్చిన ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వలసదారుల తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి వాళ్లను టెండర్‌ ఏజ్‌ షెల్టర్లకు తరలిస్తున్నారు. తమ తల్లిదండ్రులు కనిపించ పిల్లలు బోరున విలపిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా ఇదే అంశానికి సంబంధించిన వార్త చదువురు ఓ యాంకర్‌ కంటతడి పెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఎంఎస్‌ఎన్‌బీ చానెల్‌కు చెందిన యాంకర్ రేచల్ మాడో ఇప్పుడే అందిన వార్త అంటూ ఆ న్యూస్ చదవబోయి కంటతడి పెట్టింది. లైవ్‌లోనే ఆ వార్త చదవలేక ఏడ్చేసింది. అయితే తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది. వార్త చదువుతున్న సమయంలో తనను తాను నియంత్రిచుకోలేక పోయానని వెల్లడించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు వేలాది మంది మద్దతుగా నిలిచారు.

అక్రమంగా అమెరికాకు వలస వచ్చి ఉంటున్నారని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలిస్తున్న వారిలో 52 మంది భారతీయులు ఉన్నారు. గత నెలలో 123 మంది అరెస్ట్ కాగా, వారిలో అత్యధికులు దక్షిణాసియా వారే. వారిలోనూ హిందీ, పంజాబీ మాట్లాడేవారే ఎక్కువగా ఉన్నారు.

- Advertisement -