నెటిజన్ల ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన అనసూయ!

132
anasuya
- Advertisement -

యాంకర్‌గానే కాకుండా ‘క్షణం’, ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రతో నటిగా మరో మెట్టు ఎక్కారు అనసూయ భరద్వాజ్‌. ప్రస్తుతం నటిగా ఆమె మరింత బిజీ అయ్యారు. తాజాగా ‘పుష్ప’లోనూ కీలక పాత్ర పోషించారు. తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయకు ట్రోలింగ్స్‌ కొత్తేమీ కాదు. సమస్యలపై పోరాడటానికి ఆమె ఎప్పుడు ముందుంటుంది.

సంక్రాంతి సందర్భంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంతగా తెలీదు కదా! నీ ప్రశ్న ఏజ్‌ షేమింగ్‌ కింద అనిపిస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని ధీటైన జవాబు ఇచ్చింది.

ఇక దీనిపై నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతుండగా గతంలోలాగా ట్రోలింగ్‌ గురించి, నేను, నా ఫ్యామిలీ అసలు పట్టించుకోవడం లేదు. మేమంతా ఇప్పుడు స్ట్రాంగ్‌ అయ్యాం. ఒకరు మరొకరిని బాధ పెడితే చివరికి వారు కూడా ఆ బాధను అనుభవిస్తారు. కర్మ అనేది ఒకటి ఉంటుందని కాస్త ఘాటుగానే స్పందించింది అనసూయ.

- Advertisement -