చేనేత కార్మికులకు అనసూయ చేయూత..

610
Anchor Anasuya
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటుంది. ఈ కరోనా వైరస్‌ వల్ల అన్ని రంగాలు గత కొంతకాలంగా డీలా పడిపోయాయి.. ఎందరో కార్మికులు ఉపాధిని కోల్పోయి ఆకలికి అలమటిస్తున్నారు. అయితే వారందిని ఆదుకోవడానికి సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ తన మంచి మనస్సును చాటుకున్నారు. పోచంపల్లి చేనేత కళాకారులకు అండగా నిలించింది అనసూయ. యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి సందర్శించిన అనసూయ 40 మంది నిరుపేద చేనేత కార్మికులకు 25 కిలోల బియ్యం, ఐదు కిలోల కందిపప్పు, మంచి నూనె తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అనంతరం పోచంపల్లిలో చేనేత కళాకారులు తయారుచేస్తున్న ఇక్కత్‌ వస్త్రాలు పరిశీలించిన అనసూయ అబ్బురపడ్డారు. కళకారుల పనితీరుని మెచ్చుకున్నారు. చేనేత కళాకారులను బతికించుకోవాలని అనసూయ అన్నారు. తనకు చేనేత వస్త్రాలంటే ఎంతో ఇష్టమని, సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. తానే కాకుండా తన తోటి కళాకారులు, స్నేహితుల ద్వారా కూడా చేనేత రంగానికి తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తానని అనసూయ చెప్పుకొచ్చింది. అనసూయ చేసిన సాయానికి చేనేత కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తూ.. గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -