సముద్ర తీరంలో అనసూయ అందాలు..

375
Anchor Anasuya Gets Romantic At Beach!
- Advertisement -

బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తునే సినిమాల్లో వచ్చే వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది యాంకర్ అనసూయ. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ సినిమాలోని రంగమ్మత్త పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచే కాక సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుని మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో రాంచరణ్‌కు అత్తగా నటించి పాత్రకు సరైన న్యాయం చేసిందని కొందరు అభినందించిన విషయం తెలిసిందే. ఇలా యాంకర్‌గా, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ హాట్ యాంకర్ తన ఫ్యామిలీకి అప్పడప్పుడు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తుంది.

 Anchor Anasuya Gets Romantic At Beach!

తన పిల్లల విషయం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ఎన్ని ప్రోగ్రామ్‌లు చేసినా..ఎన్ని టీవీ షోలు చేసిన తన ఫ్యామిలీకి మాత్రం దూరమవ్వాలనుకోదు. అయితే ఇటీవల కాలంలో షూటింగ్‌లతో బిజీగా గడిపిన ఆమె తన పిల్లల కోసం, తన భర్తకు కోసం కొంత టైమ్ కేటాయించింది. తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లి అక్కడ తన పిల్లలతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ తన ఫ్యామిలీ పట్ల తనకున్న ప్రేమను తెలియజేసింది. తొంగి చూస్తున్న లేలేతల కిరణాల మధ్య తన ఫ్యామిలితో దిగిన ఫోటోస్ సూపర్బ్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -