చీరకట్టులో అదిరిపోయిన అనసూయ…..

326
Anchor Anasuya at awards function
- Advertisement -

ఎప్పడు చిట్టిపొట్టి డ్రెస్‌లు వేసుకుని కనిపించే యాంకర్ అనసూయ…చీరకట్టులో కనిపించింది. యాంకర్‌గా ఉన్నపుడే తన హాట్‌ లుక్స్‌తో ప్రేక్షకులను మత్తెక్కించిన ఈ అందాల బొమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక స్టైల్‌నే కాదు తన లుక్స్‌ కూడా మార్చేసింది. ఇటీవలే జరిగిన ఓ ఛానల్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో అనసూయ చీరకట్టులో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పింక్ కలర్ శారీ కట్టిన అనసూయ.. సీ గ్రీన్ స్లీవ్ లెస్ జాకెట్ లో సందడి చేసింది. ఫ్రంట్ లుక్ లో మాత్రం అచ్చమైన తెలుగింటి అందగత్తె లుక్ ఇచ్చిన అనసూయ.. వెనక నుంచి మాత్రం బ్యాక్ లెస్ జాకెట్ లోంచి వీపంతా ఆరబోసేసింది. జాకెట్ కి కట్టిన డోరీస్ అమ్మడి అందానికి.. వేసిన డ్రస్సుకు మరిన్ని హంగులు అద్దాయి. ఈ మధ్య టీవీల కంటే సినిమాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్న ఈ భామ.. బుల్లితెర తారల మధ్యలో నుంచున్న వెండితెర బ్యూటీగా ఎట్రాక్ట్ చేసేసింది.

 Anchor Anasuya at awards function

అటు టీవీషోలతో పాటు.. రీసెంట్ గా సాయి ధరం తేజ్ నటిస్తున్న మూవీ విన్నర్ లో ఓ ఐటెం సాంగ్ డ్యాన్స్‌ చేసింది అనసూయ . ఇలా స్పెషల్ సాంగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక అనసూయా భరద్వాజ్ కు అవకాశాలు అనేకానేకం వచ్చేస్తున్నాయట.

జబర్దస్త్‌ పుణ్యమ అని యాంకర్ నుంచి ఐటెం సాంగ్ హీరోయిన్‌ వరకు అనసూయ ఎదిగిపోయదని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.

- Advertisement -