మోడీకి దగ్గర పడ్డ 50రోజులు…..

241
- Advertisement -

గత నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక ప్రకటన చేశారు. నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని, దేశం కోసం 50 రోజులపాటు ఆ కష్టాలను భరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 50 రోజుల్లో ప్రజల కష్టాలు తీర్చకుంటే వారు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధమని ప్రకటించారు. ప్రధాని మాటలపై ఉన్న విశ్వాసం, దేశాభివృద్ధి కోసం ప్రజలు ప్రధాని మోదీ ప్రకటనను స్వాగతించారు. ఎన్ని ఇబ్బందులు పడడానికైనా సరే అన్నారు. అన్నట్టుగానే కష్టాలు భరిస్తూ వచ్చారు.

5 days for Modis currency deadline
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు చక్కబడతాయని భావించిన ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. రోజులు గడుస్తున్నా బ్యాంకులు, ఏటీఎంల ముందు అవే క్యూలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు 80 శాతం ఏటీఎంలు దిష్టిబొమ్మల్లానే మిగిలిపోయాయి. నోట్ల ఇబ్బందులు రోజురోజుకు ఎక్కువవుతుండడంతో మొదట్లో స్వాగతించిన వారే తర్వాత విమర్శిస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అయినా అమలులోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వంపైనా, మోదీపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

5 days for Modis currency deadline

మరోవైపు మోదీ చాలా సందర్భాల్లో ఈ కష్టాలను 50 రోజులు భరించాలని పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన గడువుకు మరో వారం రోజులే ఉంది. కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆర్బీఐ నుంచి వస్తున్న డబ్బులు బడాబాబుల చేతుల్లోకి దర్జాగా వెళ్లిపోతున్నాయి. సామాన్యులు మాత్రం అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీ అన్న మాట నిలబెట్టుకుంటారా? ఇన్ని రోజుల కష్టాలకు ముగింపు పలుకుతారా? అన్న ఆసక్తి అటు రాజకీయ పక్షాలతోపాటు ఇటు ప్రజల్లోనూ నెలకొంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఇది మరింత ఆసక్తి రేకిత్తిస్తోంది. అద్భుతాలు జరిగితే తప్ప మోదీ అన్న మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మోదీ మాటలు వాస్తవ దూరమని, మరో రెండుమూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు. ఈనేపథ్యంలో అందరి దృష్టి ప్రధాని మోదీవైపు మళ్లింది. మిగిలిన వారం రోజుల్లో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ఆయన ఏం చేయనున్నారనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్.. అంటూ రోజులు లెక్కిస్తున్నారు. మరి.. మోదీ తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకుని ప్రజల్లో హీరోగా మారుతారో? ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే మరో వారం రోజులు వేచి వేచి చూడల్సిందే!

- Advertisement -