వివాదంలో విజయ్.. సర్కార్

298
Anbumani Sarkar
- Advertisement -

మెర్సిల్‌ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో విజయ్‌. తమిళ రికార్డులను తిరగరాసిన విజయ్‌…తాజాగా అగ్ర దర్శకుడు మురుగదాస్‌తో సర్కార్‌ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా సర్కార్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో విజయ్‌ సిగరెట్ తాగుతూ చాలా స్టైలీష్‌గా ఆకట్టుకున్నాడు. తమిళ తంబీలకు సైతం విజయ్ లుక్‌ తెగనచ్చేసింది.

అయితే మాజీ ఆరోగ్యశాఖ మంత్రి,ఎంపీ అన్బుమని రామదాస్‌కు మాత్రం సర్కార్ ఫస్ట్ లుక్ నచ్చలేదు. ఈ పోస్టర్ ద్వారా సిగరెట్ ను ప్రమోట్ చేస్తున్నావా? ఇలా చేయడం సిగ్గుచేటు….అంటూ విజయ్‌పై విమర్శలు గుప్పించాడు. సినిమాల్లో సిగరెట్ తాగనని అన్నావు .. ఇప్పుడు చేసిందేంటి అని మండిపడ్డారు.

అయితే,అన్బుమనిపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెర్సల్ సినిమాలోనూ విజయ్ సిగరెట్ తాగారని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ట్వీట్ చేశారు. అయితే,తమిళ హీరోలు సిగరెట్ తాగడం,వివాదాల పాలవడం కొత్తేమీ కాదు. 2002లో అన్బుమణి తండ్రి ఎస్‌. రామదాస్‌ రజనీకాంత్‌ను బాబా సినిమాలో పొగ తాగుతూ.. యువతను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆయన విమర్శించారు.

- Advertisement -