అనసూయ – విజయ్ గొడవ.. రిజన్ అదే

64
- Advertisement -

యాంకర్ అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. ఇప్పుడే ఒకటి చూశాను. ‘THE’ నా? బాబోయ్‌.. పైత్యం.. ఏం చేస్తాం. అంటకుండా చూసుకుందాం” అని ట్వీట్ చేసింది. ఖుషీ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ పోస్టర్‌లో విజయ్‌ పేరుకు ముందు THE ఉండటంపై అనసూయ పై విధంగా కామెంట్‌ చేసింది. దాంతో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ గరం అయ్యారు. అనసూయను ట్రోల్ చేస్తున్నారు. పైగా ‘AUNTY’ అనే హ్యాష్‌ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ.. రౌడీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అయితే, తన పై జరుగున్న ట్రోల్స్ విషయంలో అనసూయ స్పందించారు. ‘ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తప్పులు చేసే వారిని, నిలదీసేందుకు ఈ స్టార్స్‌ను ఏం ఆపుతుందో తెలియట్లేదు. వారిని ఆపితే.. మీ ఫాలోయింగ్ పోతుందా?, ఆ ఫాలోయింగ్ లేకుంటేనే బెటర్’ అని అనసూయ ట్వీట్ చేసింది. అయినా, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తగ్గలేదు. ఇంకా రెచ్చిపోయారు. దీంతో అనసూయ మళ్లీ రియాక్ట్ అవుతూ.. ‘భలే రియాక్ట్ అయ్యారు దొంగ.. ఊప్స్.. బంగారుకొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

Also Read: సామ్ ఎల్లప్పుడూ బాగుండాలి:నాగచైతన్య

మొత్తానికి అనసూయ ఇలా వరుస ట్వీట్స్ చేస్తూనే ఉంది. అనసూయపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అసలు అనసూయకి విజయ్ దేవరకొండ అంటే.. ముందు నుంచీ పడదు. ఎందుకో మరి. గతంలో వారిద్దరి మధ్య ఓ ఇంటర్వ్యూ లో గొడవ జరిగింది. ఆ గొడవే ఇప్పటి ట్విట్టర్ వార్ కి కూడా కారణం అయింది.

Also Read: ఓటీటీలోకి ఆ మూడు చిత్రాలు

- Advertisement -