విలన్‌గా మారిన అనసూయ!

144
anasuya
- Advertisement -

యాంకర్ అనసూయకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. బుల్లితెరపై.. వెండితెరపై తన వాక్చాతుర్యంతో.. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్న అనసూయ మళ్లీ విలన్‌గా మారనుంది.

అనసూయ నటించిన తాజా చిత్రం ‘దర్జా’.పీయస్‌యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కగా ఈ సినిమా జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అనసూయ పూర్తి స్థాయిలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటిస్తోందట.

ఇటీవలె పుష్ప 2 సినిమాలో విలన్‌గా మెప్పించింది అనసూయ. అలాగే కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కీలక పాత్ర చేస్తోంది.

- Advertisement -