సినిమా వాళ్ల వల్లే రేప్‌లా…అనసూయ ఫైర్‌..!

379
anasuya

సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ ఘటనపై తీవ్రంగా స్పందించింది యాంకర్ అనసూయ. సినిమా వాళ్ల వల్లే యూత్ తప్పుదారి పడుతున్నారని…ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కి ఘాటుగా స్పందించింది. దిశ రాత్రి టైంలో బ్యూటీ పార్లర్‌కి ఎందుకు వెళ్లాలి…?రేప్ చేసే వాళ్లకు కూడా స్వేచ్ఛ ఉందని కొంతమంది మాట్లాడుతున్నారని అసలు ఆడది అలా ఉండాలి..?ఇలా ఉండాలి అని డిసైడ్ చేయడానికి మీరు ఎవరు అంటూ మండిపడింది.

మేం ఏం బట్టలు వేసుకోవాలో కూడా మీరే చెప్తారా? మీకు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. మా జాగ్రత్తలో మేం ఉంటున్నాం.. అయినా ఇలాంటివి జరగుతున్నాయని తెలిపింది. ఇంట్లో పిల్లల్ని సరిగా పెంచండి. నీ బిడ్డలాగే ఎదుటి వాడి బిడ్డను చూడు. నీ కామపు చూపులు మానెయ్యి. నేను మాట్లాడుతుంటే ఎవడో.. ఏందే నీ గోల అంటున్నాడు. నేను వాడి ముందు ఉంటే మాటలు కాదు.. ఉచ్చ పడుద్ది వాడికి అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

దిశ ఘటనలో తాను చాలా ఫీల్ అయ్యా. అది మాటల్లో చెప్పలేను. కోపమా? భయమా? బాధా? ఏంటో చెప్పలేను. ట్వీట్ పెట్టి చేతులు దులుపుకోలేనని తెలిపింది. ఎమోషన్‌లో వాడకూడని పదాలు వాడితే క్షమించాలని తెలిపింది అనసూయ.

Anchor anasuya on Disha insident…anasuya on Disha insident