అనసూయ బరద్వాజ్..బుల్లితేరపై జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు యాంకర్‌గా వ్యవహరించి తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఒక పక్క బుల్లితెరపై రాణిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రామచరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో రంగమత్త క్యారెక్టర్‌లో నటించి తన నటనతో మంచి మార్కులే కొట్టేసి ప్రసంశలు కూడా అందుకుంది. ఈ సినిమా హిట్‌తో అనసూయకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయట. అనీల్ రావుపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ అమ్మడుకు చాన్సు వచ్చినట్టు సమాచారం.
ఈ మల్టీస్టారర్‌లో వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమాలో అనసూయ కోసం ప్రత్యేకించి ఓ పాత్రను రాసుకున్నాడట దర్శకుడు అనీల్ రావుపూడి.ఈ సినిమాకు ఎఫ్2 అనే టైటిల్ పెట్టారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉపశీర్షికను వస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించనున్నారు. హీరోయిన్‌గా మెహరీన్‌ని ఎంచుకున్నట్లు సమాచారం. మరో హీరోయిన్‌గా ఇంకా ఎవరూ ఖారారు కాలేదని తెలుస్తోంది. మొత్తానికి అనసూయ పాత్ర కోసం సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ సినిమా మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.