ట్విట్ట‌ర్ ద్వారా ప్రాణం నిలిపిన కేటీఆర్..

306
Twitter is the venue for the protection of the minister Ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా బాధితుల‌ను ఆదుకుంటూ మ‌న‌సున్న మా రాజుగా పేరు సంపాదించుకున్నారు. ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ప్రాణాల‌ను కాపాడుతున్నారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అల్లాపూర్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ కుమార్తే అయిన దివ్య‌. తిరుమ‌లగిరిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆ అమ్మాయి ఎడ‌మ కాలుపై నుంచి డీసీఎం వెళ్ల‌డంతో తీవ్ర గాయాల‌పాల‌య్యింది. కాలు తొల‌గించాల‌ని లేక‌పోతే పాప ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని, చిన్నారి వైద్యం కోసం దాదాపు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు తెలిపారు. ఆ త‌ల్లిదండ్రులు వైద్యం చేయించ‌లేని దీన‌మైన‌ స్థితిలో ఉన్నారు.

Twitter is the venue for the protection of the minister Ktr

ఇ స‌మాచారాన్నితెలుసుకున్న‌కూక‌ట్‌ప‌ల్లికి చెందిన టీఆర్ఎస్ య‌వ‌జ‌న‌ నాయ‌కులు జ‌గన్మోహ‌న్‌రావు ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా స‌మాచారమందించారు. వెంట‌నే స్పందించిన ఆయ‌న నిమ్స్ డైరెక్ట‌ర్‌తో మాట్లాడి అ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాని ఆదేశించారు. అందుకు అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. వెంట‌నే వైద్యులు దివ్య‌కు కాలుకు ఆప‌రేష‌న్ చేసి కాలును తొలగించారు. ప్రాణ‌పాయం నుంచి ర‌క్షించారు. కేటీఆర్ దివ్య విష‌యంలో స్పందించిన తీరుపై నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -