యాంకర్ అనసూయ… ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్లలో అనసూయ ముందువరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తనదైన చలాకితనంతో యాంకరింగ్ కే సొగబులు అద్దిన ఈ సుందరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించి, లేటెస్ట్ లుక్స్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. అయితే తాజాగా కంటతడి పెడుతు ఎమోషనల్ అయింది అనసూయ.
వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను షేర్ చేయడంపై అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మీరంతా మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నా.. ఈ పోస్ట్ కు మీరంతా చాలా గందరగోళంలో ఉంటారని తెలుసు. ఒకరికి మరొకరు మద్దతుగా ఉండటానికి వాడాలి. తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలి.. ఇతరుల జీవనశైలి, సంస్కృతులను తెలుసుకుంటుండాలన్నారు.
కొన్నిసార్లు నాపై ట్రోలింగ్ జరుగుతుంది.. రెండు మూడురోజులు బాధపడి తిరిగి నవ్వుతూ మీ ముందుకు వస్తున్నాను.. విశ్రాంతి తీసుకొని రీఛార్జ్ అవుతాను.. సమస్యల నుంచి పారిపోయే మనస్తత్వం కాదు నాది.. అందరి పట్ల దయగా ఉండాలని అందరినీ కోరుతున్నాను.. ఎదుటి వారు మనకు ఏం చేసినా సరే.. వారిపై దయను చూపించండి.. వారికి సమస్యలు వస్తే అండగా ఉండండి.. వాళ్లే తిరిగి మీ వద్దకు వస్తారు.. నేను కూడా ఇప్పుడు అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా అని తెలిపింది. ఐదు రోజుల క్రితం తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:డార్లింగ్ సరసన అందాల ‘నిధి’!