బులితెరపై యాంకర్ గా రాణిస్తూనే.. వెండి తెరపై కూడా మంచి గుర్తింపు ఏర్పర్చుకున్నారు అనసూయ. నేడు అనసూయ పెళ్లి రోజు సందర్బంగా భర్తతో కలిసి మాల్దీవుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అనసూయ ఓ ట్వీట్ చేశారు. తన భర్త స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారని ట్వీట్ లో తెలపింది.
మా ఇద్దరి మధ్య అమితమైన ప్రేమ ఉంది. ఆయన మరోసారి సర్ ప్రైజ్ చేశారు. మా పెళ్లి రోజు కానుకగా ఈ ఏడాది మాల్దీవులకు తీసుకొచ్చారు. 2018లో వివాహ వార్షకోత్సవ ట్రిప్, ఆయనను నాకు ఇచ్చింనందుకు థ్యాంక్స్ గాడ్ అంటూ ట్వీట్ చేసింది. మాల్దీవుల్లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది.
సహ యాంకర్ రష్మి అనసూయకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. మీ అందమైన జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మాల్దీవుల ట్రిప్ ను ఎంజాయ్ చేయండి అంటూ ఈ దంపతులు ఫోటోను పోస్టు చేసింది. మరోవైపు రంగమ్మత్త పాత్రతో మంచి గుర్తుంపు రావడంతో ఈ అమ్మడుకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఐదు సినిమాలలో నటిస్తోంది.
And he does it again!!! My best!!!! Got us to #Maldives this year!!!!! How much more can love get from us!!! Hahahha😍 #touchwood #Bestsurpriseplanner #hubbygoals #hubbylove #MarriageAnniversary2018trip ❤️❤️❤️ #thankyouGodforhim 😍❤️❤️😘 pic.twitter.com/ownRuvPEFF
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 3, 2018