థాంక్యూ సీఎం కేసీఆర్ సార్‌: అనసూయ

311
anasuya
- Advertisement -

తెలంగాణలో షరతులతో సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసింద. షూటింగ్ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, పొగత్రాగకూడదని ఖచ్చితంగా ఓ డాక్టర్ అందుబాటులో ఉండాలని పలు షరతులను విధించింది ప్రభుత్వం.

ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూనే షూటింగ్ కొనసాగిస్తామని సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ అనసూయ స్పందించారు.

మా పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. థ్యాంక్యూ కేసీఆర్‌ సర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సర్. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తామని ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమలో అన్ని స్థాయిల్లో ఉన్న వారికి ఇది చాలా గొప్ప వార్త. ఎంటర్టైన్‌మెంట్‌ తప్ప మాకు ఇతర ఏ పనీ తెలియదని పేర్కొన్నారు.

- Advertisement -