రామ్ చరణ్ కు అత్తగా అనసూయ..?

215
Anasuya-and-Ram-Charan
- Advertisement -

అనసూయ తన భినయం..అందంతో బుల్లి తెర ప్రేక్షకులని టీవీల ముందు కట్టిపడేలా చేస్తుంది. బుల్లి తెరమీద మాత్రమే కాదు..బిగ్ స్క్రీన్ మీద కూడా అప్పుఅప్పుడు మెరిసిపోతోంది..ఆ మధ్య సోగ్గాడే చిన్నినాయనలో వచ్చి అందరిని మెప్పించింది..తరువాత సాయి ధరమ్ తేజ్ విన్నర్ లో ఓ ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. అసలు అనసూయకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మరేమో..అంతలా తన గ్లామర్ ని మైంటైన్ చేస్తుంది. ఆ షో కారణంగానే ఆమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ram-charan-and-anasuya

అయితే గత కొన్ని రోజులుగా అనసూయ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో అనసూయ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. సినిమాపై ఆమె చేసిన నెగెటివ్ కామెంట్స్ తో ఏకీభవించని నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆ వివాదం ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతుందనుకుంటే ఇంతలోనే మరోసారి అభిమానుల మీద ఆగ్రహాన్ని చూపుతూ వార్తల్లోకెక్కింది అనసూయ. ఫేస్ బుక్ లైవ్ ద్వారా అభిమానులతో మాట్లాడాలనుకుంది అనసూయ.

ram-charan-and-anasuya

ఇందులో భాగంగా ఓ వ్యక్తి..’మేకప్ లేకుండా మీరు అందంగా లేరు. చూడడం చాలా కష్టంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఆగ్రహించిన అనసూయ ఫ్యాన్స్ తో కొంత సమయం కేటాయించాలని అనుకుంటే ఇలాంటి కామెంట్ చేస్తావా..? ఒకప్పుడు సినిమా వాళ్ళను దూరం నుండి చూసే ఆనందపడేవారు. ఇప్పుడు మాట్లాడదామని లైవ్ లోకి వస్తే ఇలా కామెంట్ చేస్తారా అంటూ ఆవేదన చెందింది. స్పెషల్ రోల్ లో కనిపిస్తానని స్పష్టం చేసింది.

- Advertisement -