బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్, ఉపాసన…

202
Charan-Upasana-Dance-
- Advertisement -

టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన బతుకమ్మ సంబరాల్లో డ్యాన్స్ చేసి అలరించారు. హైదరాబాద్‌ నగరంలోని విజయనగర్ కాలనీలోని గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవ సమాజ్ బాలిక నిలయం (అనాధ శరణాలయం )పిల్లలతో జరుపుకున్నారు. ఆ పిల్లలతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆడి,పాడారు. వీరి తో బాటు నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉంది.

ఈ విష‌యాన్ని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోను పోస్ట్ చేసింది.అందరికి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేశారు. చెర్రీ ఉపాసనలతో కలిసి గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజ్ బాలికలు ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఈ వేడుకలో నాగబాబు కూతురు నిహారిక ఉపాసన తల్లి శోభన కూడా పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడుతున్న వీడియోను రాంచరణ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘బాలికా నిలయంలోని బాలికలతో దసరా బతుకమ్మ సంబరాలు. పదేళ్లుగా మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇలాగే ఇంకా అనేక ఏళ్లు సాగాలని కోరుకుంటున్నా అంటే చెర్రీ మెసేజ్ చేశాడు.తమ అభిమాన హీరో అనాథ బాలికలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడంపై చెర్రీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -