టాలీవుడ్ యాంకర్ అనసూయ తన ఏజ్ ఎంతో చెప్పి అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా ఉన్న అనసూయ రజాకార్ అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ “38 ఏళ్ళు వచ్చాయి నాకు” అంటూ చెప్పేశారు. దీంతో విలేకర్లు.. ‘మీరు ఫ్లోలో మీ ఏజ్ చెప్పేశారు’ అని చెప్పడంతో.. అనసూయ నవ్వుతూ సిగ్గు పడింది. మొత్తానికి 38 ఏళ్ల వయసులో కూడా అనసూయ క్రేజీ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్ళ హృదయాలను కల్లోలం చేస్తుంది.
ఇక అనసూయ చేస్తున్న రజాకార్ మూవీ టాలీవుడ్‌లో కాంట్రవర్సీ సినిమాగా తెరకెక్కుతుంది. రజాకార్లు చేసిన అరాచకాల నేపథ్యంలో ఈ మూవీ రానుంది. ఈ చిత్రం నుంచి బతుకమ్మ సాంగ్‌ను బీజేపీ నాయకురాలు డీకే అరుణ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట బాగానే ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో ఎన్నికల హిట్ మొదలైన క్రమంలో ఇలాంటి సినిమా రావడం పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read:Telangana Congress:మనసు మార్చుకున్న జానారెడ్డి!
ఈ సినిమాని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటామని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల సహచరులు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏది ఏమైనా అనసూయ రాజకీయ వివాదాస్పద చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై యాంకర్ అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అనసూయను పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడగ్గా.. రాజకీయం అనేది నా వల్ల కాదని, చెప్పాలంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదని ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది.
Also Read:Ram Pothineni:స్కంద ఓటీటీ డేట్ ఫిక్స్!