విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈమూవీని విడుదల చేయనున్నారు. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు పూరీ పూర్తి స్క్రీప్ట్ తో రెడీ అయ్యాడు. ఫిబ్రవరి మొదటివారం నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈమూవీలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం ఇటివలే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు.
కాగా ఈమూవీలో హీరోయిన్ గా మొదట శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని అనుకోగా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం విజయ్ సరసన హీరోయిన్ గా అనన్య పాండేను తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈచిత్రాన్ని పూరీ జగన్నాథ్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండం చివరగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ప్లాప్ అవ్వడంతో ఈమూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.