అనంత్‌నాగ్.. భూకంపం మధ్యే సీ-సెక్షన్

37
- Advertisement -

గత రాత్రి దక్షిణాసియా దేశాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే భూకంపం పరిధి భారత్‌కు కూడా తాకింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు స్వల్ఫంగా భూకంపం వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయిన తొణకకుండా వైద్య సిబ్బంది తమ పనిని చేసిన తర్వాత ఆపై దేవుడిపై భారం వేశారు. ఆపరేషన్ రూంలో భూకంపం దాటికి వైద్య సామాగ్రి ఓవర్ హెడ్‌ లైట్స్ మానిటర్ ఐవీ డ్రిప్ స్టాండ్ ఊగడం ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌ సమయంలో ఓ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. సరిగ్గా ఆదే సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వైద్యులు కంగారు పడకుండా తమ పని పూర్తి చేశారు. సమస్యేం లేదు అంతా ఓకే అంటూ మరొకరు రిలాక్స్ అయ్యారు. ఇంతకి వైద్య సిబ్బంది ఏం చేశారో తెలుసా..భూకంపం సంభవించే సమయంలో ఒక పసిబిడ్డకు ఆయువు పోశారు. దీనిపై జిల్లా వైద్యాధికారులు సదరు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను సదరు సిబ్బందికి అనంత్‌నాగ్ యంత్రాంగం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి…

ప్రజా సంక్షేమంలో తెలంగాణ భేష్‌.. ఆరవింద్‌

ఆధార్‌ అనుసంధానం పొడగింపు..కేంద్రం

ఏడు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు..

- Advertisement -