దేశంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ RE కాంప్లెక్స్!

9
- Advertisement -

గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ దిగ్గజం, నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ReNew పవర్ (ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో – 17.4 GW!) ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది! అది కూడా అనంతపురంలోనే, ఏకంగా ₹22,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది.

దావోస్‌లో మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక చర్చలతో ఈ భారీ ప్రాజెక్ట్‌కు తెరలేచింది. గత ప్రభుత్వ హయాంలో PPA రద్దులతో ఆరేళ్ల విరామం తర్వాత ReNew మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం విశేషం.

అనంతపురంలో అద్భుతం:

భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ RE కాంప్లెక్స్!
మొత్తం పెట్టుబడి: ₹22,000 కోట్లు!
1800 MW సౌర విద్యుత్ + 1 GW పవన విద్యుత్!
2000 MWh భారీ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)!
మొదటి దశలోనే 587 MW సౌర, 250 MW పవన విద్యుత్ + 415 MWh BESS!
స్వచ్ఛమైన విద్యుత్ తరలించడానికి 100 కి.మీ. EVH ట్రాన్స్‌మిషన్ లైన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీకి ఇది తొలి భారీ విజయం. వేగవంతమైన అనుమతులు, ప్రత్యేక ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది మన రాష్ట్రం!

గతంలో 777 MW సామర్థ్యంతో APలో అగ్రగామిగా ఉన్న ReNew తిరిగి రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై, స్థిర విధానాలు, దూరదృష్టి మీద ఉన్న నమ్మకాన్ని చాటుతోంది.

ఇప్పటికే టాటా పవర్ (₹49,000 కోట్లు), NTPC గ్రీన్ (₹2.08 లక్షల కోట్లు), వేదాంత సెరెంటికా (₹50,000 కోట్లు), బ్రూక్‌ఫీల్డ్ (₹50,000 కోట్లు), SAEL (₹6,000 కోట్లు) వంటి దిగ్గజాల నుండి భారీ పెట్టుబడులు!
భారతదేశంలోనే అత్యంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా AP వేగంగా ఎదుగుతోంది!
ఈ అనంతపురం ప్రాజెక్ట్ కేవలం విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాదు, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధి మరియు వినూత్న పాలనకు ఆంధ్రప్రదేశ్ నిదర్శనంగా ReNew ఛైర్మన్ సుమంత్ సిన్హా చెప్పినట్లుగా, AP యొక్క ప్రగతిశీల విధానాలు భారీ పెట్టుబడులకు ఊతమిస్తున్నాయి.మొత్తానికి, అనంతపురం మరోసారి అదృష్టాన్ని కొల్లగొట్టింది! గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది.

Also Read:ధాన్యం కొనుగోళ్లపై భరోసా ఏది?:హరీష్

- Advertisement -