అనంతగిరి రిజర్వాయర్‌కు ‘అన్నపూర్ణ’ పేరు ఖరారు..

507
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజక్టు పరిధిలోని బ్యారేజిలు, రిజర్వాయర్లు, ఇతర పంప్ హౌస్ లకు దేవతాముర్తుల పేర్లు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజక్టు పరిధిలోని మొదటి ఐదు నిర్మాణాలకు పేర్లలను ఖరారు చేశారు సీఎం కేసీఆర్‌.

kcr

వాటిలో మేడిగడ్డ బ్యారేజికి లక్ష్మీ బరాజ్ అని, కన్నెపల్లి పంపుహౌస్‌కు లక్ష్మీ పంపుహౌస్‌గా, అన్నారం బ్యారేజికి సరస్వతి బరాజ్‌గా, సిరిపురం (అన్నారం) పంపుహౌస్‌కు సరస్వతి పంపుహౌస్‌గా నామకరణం చేశారు. సుందిల్ల బ్యారేజికి పార్వతి బరాజ్‌గా, గోలివాడ (సుందిల్ల) కు పార్వతి పంపుహౌస్‌గా పేరు పెట్టారు. నంది మేడారం రిజర్వాయర్, పంపుహౌస్‌కు నంది రిజర్వాయర్, పంపుహౌస్‌గా, లక్ష్మీపురం (రామడుగు) పంపుహౌస్‌కు గాయత్రి పంపుహౌస్‌గా పేర్లు ఖరారు చేశారు.

తాజాగా, అనంతగిరి రిజర్వాయర్‌కు ‘అన్నపూర్ణ’ రిజర్వాయర్‌గా సీఏం కేసీఆర్ నామకరణం చేశారు. అంతేగాకుండా, ఇక్కడి పంప్ హౌస్‌కు కూడా అన్నపూర్ణ పంప్ హౌస్ అని పేరుపెట్టారు. అయితే, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లకు మాత్రం పేర్లు నిర్ణయించలేదు. అయితే వీటికి అవే పేర్లు కొనసాగుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -