తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఆనందిబెన్‌…!

232
Anandiben as Governor for Telugu states…
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ రానున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి.. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ తో కలిసి తీసుకున్న  ఫోటో …దీనికి ‘కాబోయే గవర్నర్ తో వైసీపీ ఎంపీ భేటీ’.. అంటూ కామెంట్ ఉండటంతో చర్చకు దారితీసింది.

త్వరలో ఏడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించనున్న నేపధ్యంలో గవర్నర్ రేసులో ఆనంది బెన్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. తొలుతు ఆమెను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ తాజాగా తెలుగు రాష్ట్రాలకు ఆనంది గవర్నర్‌గా రాబోతున్నారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Anandi ben

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో ఆయన వారసురాలిగా ఆనంది బెన్ బాధ్యతలు చేపట్టారు.  గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో 1941లో ఆనంది బెన్ జన్మించారు.  1965లో భర్త మఫత్ లాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లో స్థిరపడిన  ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అయితే చాలా కాలం క్రితం ఆమె భర్త నుంచి విడిపోయారు.

ఎమ్మెస్సీ,బిఇడి చదివి, టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లో వచ్చారు. 1987లో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. 1994లో రాజ్యసభ వెళ్లారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే.

- Advertisement -