Anand Mahindra: బర్త్ డే స్పెషల్

46
- Advertisement -

ఆనంద్ మహీంద్ర..ఈ పేరు తెలియని వారుండరు. దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్. ముంబైకి చెందిన ఈ బిజెనెస్ గ్రూప్ లో ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, స్పేర్స్, నిర్మాణ పరికరాలు, డిఫెన్స్, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక మరియు భీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి మరియు ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఆఫ్టర్ సేల్స్, రిటైల్‌ ఇలా పలురకాల వ్యాపారాలున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా మనువడు ఆనంద్ మహీంద్రా. తాతా వారసత్వంతో కంపెనీలో డైరెక్ట్‌గా సీఈవో అయ్యే అవకాశం ఉన్న 1989 సంవత్సరంలో మహీంద్ర యుజిని స్టీల్ కంపెనీ లిమెటెడ్‌లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్సిక్యుటివ్ అసిస్టెంట్‌గా భాద్యతలు స్వీకరించి అంచలంచెలుగా ఎదిగి విభిన్నమైన మార్పులతో కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాడు.

Also Read:IPL 2023:ఆర్సీబీతో లక్నో ఢీ.. పరుగుల వరద ఖాయమేనా?

1955, మే 1న ముంబైలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటి నుండి డిగ్రీ పట్టాను పొందాడు. ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి అడుగుపెట్టిన తరువాత ఆటోమొబైల్ రంగాన్ని విసృతంగా అభివృద్దిపరిచాడు. అందులో భాగంగా ఎన్నో రకాల యస్‌యువిలను, యమ్‌యునవిలను,మూడు చక్రాల ఆటోలు, చిన్నపాటి వాణిజ్య వాహనాలును, ట్రాక్టర్లను, టూవీలర్లను ఆకరిరకి ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా అందిస్తున్నారు. భారతీయ రోడ్ల మీద ఇప్పుడు దాదాపుగా మహీద్రా వాహనాలే ఉన్నాయని చెప్పవచ్చు.

ఆనంద్ మహీంద్రకు ఫోటోగ్రఫి అంటే ఎంతో మక్కువ. మరియు ఇతనికి బ్లూస్ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్ట తీరిక దొరికినప్పడల్లా ఈ బ్లూస్ సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు.దేశంలో ఉన్న దాదాపు 70,000 మంది నిరుపేద అమ్మాయిలకు నన్షి కాళి అనే కార్యక్రమం ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నారు. దేశం వ్యాప్తంగా అతి పెద్ద ఉచిత త్రాగునీటి సంస్థ అయిన నాంది డానోన్ లో సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. . ఈ సంస్థ ద్వారా దాదాపుగా దేశ వ్యాప్తంగా 3 మిలియన్ల ప్రజలకు తాగు నీటిని అందిస్తున్నారు. భారతదేశం నుండి వ్యక్తిగతంగా హార్వర్డ్ హుమినిటీస్ కు అత్యదికంగా విరాళం అందిస్తున్న ఏకైక వ్యక్తి ఆనంద్ మహీంద్రా.

Also Read:నేడు మహారాష్ట్ర అవతరణ దినోత్సవం

ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులలో ఆయనను ఒకరిగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఎంపికచేసింది. అదే మ్యాగజైన్ 2011లో ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఆనంద్ మహీంద్రా పేరు చేర్చింది. ఆనంద్ మహీంద్రాను ఫోర్బ్స్ (ఇండియా) 2013 సంవత్సరానికి ‘ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించింది. 2020 జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది.

- Advertisement -