- Advertisement -
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మెడిసిన్ కోసం చైనా తర్వాత భారత విద్యార్థులు ఎక్కువగా ఆశ్రయిస్తోన్న రెండో దేశం ఉక్రెయిన్.
ఈ విషయంపై స్పందించిన మహీంద్రా గ్రూప్ అధినేత.. భారత్‌లో వైద్య కళాశాలల కొరత ఉందనే విషయం నాకు తెలియదు.. మహీంద్రా యూనివర్శిటీ క్యాంపస్‌లో మెడికల్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించొచ్చేమో అంటూ ట్వీట్ చేస్తూ టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నారీని ట్యాగ్ చేశారు. కష్ట సమయంలో ఆనంద్ మహీంద్ర సరికొత్త ఆలోచనలకు ఫిదా అయిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
- Advertisement -