ఓటీటీలో ఆనంద్ ‘హైవే’!

81
highway
- Advertisement -

దొరసాని చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన హీరో ఆనంద్ దేవరకొండ. తాజాగా ఆనంద్ నటించిన చిత్రం హైవే విడుదలకు సిద్ధంగా ఉంది. కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ ఐశ్వర్యా లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మించారు.

ఆనంద్ సరసన మానసా రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైమన్ కింగ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది.ఈ నెల 19న ఆహా‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సరికొత్త కథాంశంతో రాబోతున్న ఈ సినిమాపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు ఆనంద్.

- Advertisement -