ప్రపంచవ్యాప్తింగా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు కరోనా సోకకుండా ప్రజలకు అవగాహన కప్పిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సందేశాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిత్ర కళాకారుడు అందరినీ ఆలోచింపజేసేలా చేశాడు.
ఓ పెద్ద ఆకుపై తెలంగాణ రాష్ట్ర పటాన్ని, సీఎం కేసీఆర్ చిత్రాన్ని, మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ముఖాన్ని, ఎంపీ సంతోష్ కుమార్ పేరును, దయచేసి మాస్క్ ధరించండి అనే నినాదాన్ని చిత్రీకరించాడు. అయితే ఈ చిత్రాన్ని చూసిన టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
రాష్ట్రానికి రక్షగా సీఎం కేసీఆర్ ఉన్నారని, కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాల్సిందిగా ఉన్న ఈ చిత్రం చూడచక్కగా ఉందని సంతోష్ కుమార్ అన్నారు. ఇంత అద్భుత ప్రతిభ చూపిన ఆర్టిస్టుకి అభినందనలు తెలిపారు. ప్రతిఒక్కరిని ఆలోచింపజేసే విధంగా చిత్రకారుడు చిత్రాన్ని గీశాడని కొనియాడారు. దీన్ని లీఫ్ ఆర్ట్ అద్దామా లేక ఇంకేదైనా పేరుతో పిలువండి కానీ ఇది ఎంతో ఆకర్షించేవిధంగా ఉందన్నారు. చాలా మంచి సందేశం అందజేస్తుందన్నారని ఎంపీ సంతోష్ తెలిపారు.
An #Absolute treat to watch this. Appreciate the hard work the #Artist has done to make this thoughtful creation. Can we call it a #LeafArt or something else? It’s catchy and has very good message that we always #WearMask to protect ourselves from the #COVID19👌👇.@TelanganaCMO pic.twitter.com/tsv3vpPsSv
— Santosh Kumar J (@MPsantoshtrs) May 10, 2020