- Advertisement -
కెనడా ముద్దుగుమ్మ అమీ జాక్సన్ శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు చాన్స్ కొట్టేసింది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన గతంలో ‘ఐ’ నటించి, తాజాగా రజనీకాంత్‌తో జతకట్టి ‘2.0’లోనూ నటించింది అమీ. అయితే ఇప్పుడు అమీజాక్సన్ అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, రజనీతో కలిసి నటించిన ‘2.0’ చిత్రం విడుదలైతే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిందట అమీ.
అయితే ఈ సినిమా విడుదల దీర్ఘకాలంగా వాయిదాలు పడుతూ ఉండటం, కొత్త అవకాశాలు తన తలుపు తట్టక పోవడంతో నిరాశ చెందిన అమీ జాక్సన్, ఇండియన్ మూవీస్ కి గుడ్ బై చెప్పి, ఆఫ్రికా దేశంలోని మొరాకో నగరంలో సెటిల్ కావాలని భావిస్తోందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజమనేది స్వయంగా అమీ చెబితేగాని తెలియదు.
- Advertisement -