బంపర్ ఆఫర్ కొట్టేసిన క్రేజీ భామ..!

178
Amy Jackson Upcoming New Movies,
- Advertisement -

అమీ జాక్సన్..ఈ పేరు చెపితే చాలు కుర్రాళ్లలో వేడి సెగలు పుడతాయి..స్వతహాగా బ్రిటిష్ బ్యూటీ కావడం తో అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకడుగు వెయ్యకుండా.. తన హాట్ హాట్ అందాల ఆరబోతతో ఎప్పుడూ మీడియాలో కనిపిస్తుంటుంది ఈ భామ. సినిమాల్లోనే కాదు బయటకు కూడా ఈ అమ్మడు అందాల ప్రదర్శన భారీగా చేస్తుంది అనే చెప్పాలి.

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘ 2. 0 ‘ మూవీ లో నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి – దర్శకుడు గోకుల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం లో అమీ జాక్సన్ ను ఎంపిక చేయాలనీ భావిస్తున్నారట.

ఇప్పటికే అమీ తో దర్శకుడు చర్చలు జరిపాడట..అమీ సైతం ఈ మూవీ లో నటించేందుకు సిద్దమే అన్నట్లు మాట్లాడినట్లు తమిళ్ మీడియా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం విజయ్ త్రిషతో 96.. సమంతతో అనీతి కథైగళ్ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే.. గోకుల్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.

- Advertisement -