పెళ్లి పీటలెక్కనున్న అమీ జాక్సన్!

15
- Advertisement -

ఎవరు చిత్రంతో వెండితెరకె పరిచయమైన బ్యూటీ అమీ జాక్సన్. తర్వాత రోబో 2.0 సినిమాతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాతో బిజీగా ఉంది అమీ జాక్సన్. ఇక త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లిపీటలు ఎక్కనుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను వివాహం చేసుకోనుంది అమీ జాక్సన్.

స్విట్జర్లాండ్‌లో అందమైన ప్రదేశంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అమీజాక్సన్‌కు రింగ్‌ తొడిగి వెస్ట్‌విక్‌ ప్రొపోజ్‌ చేశాడు. అమీజాక్సన్‌ సైతం వెస్ట్‌విక్‌ ప్రొపోజల్‌కు ఓకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా పలువురు ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.

అమీ జాక్సన్‌ గతంలో బిజినెస్‌మేన్ జార్జ్‌ పనయోట్టుతో ప్రేమాయణం నడిపించింది. 2019లో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరుగగా పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే వీరి బంధానికి ఎండ్ కార్డు పడింది. తాజాగా ఇప్పుడు హాలీవుడ్‌ నటుడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైంది.

Also Read:ఈ డ్రింక్స్ తో కొలెస్ట్రాల్ కు చెక్!

- Advertisement -