- Advertisement -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ప్రణయ్ ను హత్య చేపించాడు అమృత తండ్రి మారుతీరావు. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఉరివేసుకుని మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు.
వ్యక్తిగత పని నిమిత్తిం నిన్న హైదరాబాద్ కు వచ్చిన మారుతీరావు రాత్రి ఆర్యవైశ్య భవన్ లో బస చేశారు. ఉదయం చూసే సరికి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు స్వస్ధలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -