ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు ఆమ్రపాలి.
డీవోపీటీ ఆదేశాలతో ఆమ్రపాలి గతేడాది అక్టోబర్‌లో ఏపీ కేడర్‌కు వెళ్లారు. అయితే, తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆమ్రపాలి ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థించారు. ఆమ్రపాలి GHMC కమిషనర్‌గా పనిచేశారు. ఏపీలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ప్రభుత్వం నియమించింది.
తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతితో పాటు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను కేంద్రం ఏపీ క్యాడర్ కు కేటాయించింది. అటు ఏపీలో కొనసాగుతున్న సృజన, శివశంకర్, హరికిరణ్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను తిరిగి తెలంగాణకు వెళ్లాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.
Also Read:కుబేర..4 రోజుల వసూళ్లెంతో తెలుసా?

