టీమిండియా ఓటమికి కారణం అదేనా?

8
- Advertisement -

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలుమార్లు క్యాచ్‌లు వదిలేయడమే టీమిండియా ఓటమికి కారణమైంది. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్ క్యాచ్ వదిలేయడంతో సిరాజ్ సహా కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్ తరువాత గిల్ మాట్లాడుతూ.. ఇది గొప్ప టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అవకాశాలు వచ్చాయి. కానీ, మేము క్యాచ్‌లు వదిలేశాము. దీనికితోడు లోయర్ ఆర్డర్‌లో కూడా పరుగులు రాబట్టలేక పోయాం అన్నారు. భవిష్యత్తులో ఈ అంశాలలో మెరుగైన ప్రదర్శన ఉంటుందని ఆశిస్తున్నాను అని గగిల్ తెలిపాడు.

()భారత్ తొలి ఇన్నింగ్స్ 471
() ఇంగ్లాండ్ తొలి ఇన్నింతగ్స్ 465
() భారత్ రెండో ఇన్నింగ్స్ 364
() ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 373

Also Read:కుబేర..4 రోజుల వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -