‘అమ్మాయిలంతే..అదో టైపు’ ట్రైల‌ర్..

238
- Advertisement -

ఇటీవ‌లి కాలంలో బంధాలు అనుబంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆ కోవ‌లోనే ఆక‌ట్టుకోబుతున్న మ‌రో ఆస‌క్తిక‌ర‌ చిత్ర‌మిది. తండ్రి -త‌న‌య‌ల అనుబంధం నేప‌థ్యంలో ఉద్వేగ‌భ‌రిత‌మైన కంటెంట్ తో తీస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమా ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. పెద్ద విజ‌యం సాధిస్తుంది“ అన్నారు శ్రీ‌కాంత్ అడ్డాల‌. గాళ్స్‌లో ఎమోష‌న్స్ బేస్ చేసుకుని, తండ్రి – త‌న‌యల‌ బాంధ‌వ్యంపై తెర‌కెక్కిస్తున్న సినిమా `అమ్మాయిలంతే .. అదో టైపు`. కృష్ణమ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపి వర్మ, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా ప్ర‌ధాన తారాగ‌ణం. గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ ఆవిష్క‌రించిన అనంత‌రం ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

'Ammayilanthe Adho Type' Movie Trailer Launch

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ -“ఓ తొంద‌ర‌పాటు నిర్ణ‌యం తండ్రి -కూతుళ్ల మ‌ధ్య దూరం ఎలా పెంచింది? త‌ండ్రి ప్రేమ‌కు దూర‌మైన కూతురు అనుభ‌వించే బాధ, ఆ క్ర‌మంలో సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సీనియర్ నటులు శివాజీ రాజా కీల‌క పాత్ర పోషించారు. ఓ బాధ్యతాయుతమైన తండ్రి గా ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. న‌వ‌త‌రం న‌టీన‌టుల పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. భావోద్వేగాల‌తో సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్ ని ఆక‌ట్టుకుంటుంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

'Ammayilanthe Adho Type' Movie Trailer Launch

గోపి వర్మ‌, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా, సాయి, భ‌ద్ర‌మ్‌, వేణుగోపాల్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీనివాస్‌, కూర్పు: గోపి సిందమ్, సాహిత్యంః పూర్ణాచారి, ద‌ర్శ‌కత్వంః కృష్ణ‌మ్.

- Advertisement -